Sun Mar 15 2026 11:54:03 GMT+0530 (India Standard Time)
Breaking : సంగారెడ్డిలో గుండెపోటుతో బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పన్నెండేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పన్నెండేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. బాలుడు ఖలీల్‌కు పన్నెండేళ్లు. నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించే లోగానే ఖలీల్ మరణించారు.
నిద్రలోనే అపస్మారక స్థితిలోకి...
నిద్రలోనే అపస్మారక స్థితిలోకి బాలుడు ఖలీల్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా పన్నెండేళ్ల బాలుడు ఖలీల్ గుండెపోటుకు గురి కావడం విషాదరకమని వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఖలీల్ మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు గుండలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులకు గుండెపోటు రావడం, మృతి చెందడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

