Mon Mar 16 2026 16:12:08 GMT+0530 (India Standard Time)
బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీ నేత మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి నిన్న రాత్రి మరణించా

తెలంగాణ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీ నేత మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి నిన్న రాత్రి మరణించారు. భద్రాచలం నియోజకవర్గానికి కుంజా సత్యవతి శాసనసభ్యురాలిగా వ్యవహరించారు. భద్రాచలంలోని ఆమె స్వగృహంలో ఛాతీ నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.
ఛాతీ నొప్పితో...
కుంజా సత్యవతి సీపీఎం పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. 2009లో ఆమె భద్రాచలం శాసనసభ నుంచి ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీలోకి వెళ్లిన కుంజా సత్యవతి తర్వాత కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత బీజేపీలోకి చేరారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలం టిక్కెట్ ఆమెకే వస్తుందని బీజేపీలో ఆమె అభిమానులు చెబుతున్నారు. కుంజా సత్యవతి మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story

