Fri Dec 05 2025 13:17:22 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ లో హోంమంత్రి కాన్వాయ్
భారీ వర్షం కారణంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాలు కిలో మీటర్ల కొద్దీ నిలిచిపోయాయి

భారీ వర్షం కారణంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాలు కిలో మీటర్ల కొద్దీ నిలిచిపోయాయాయి. భాగ్యలత సెంటర్ నుంచి హయత్ నగర్ వరకూ రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. కుండపోత వర్షం కురియడంతో రోడ్లపైకి నీరు చేరడంతోనే వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
జాతీయ రహదారిపై...
ఇక హోంమంత్రి మహమూద్ ఆలీ కాన్వాయ్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ముందుకు కదలకపోవడంతో పోలీసులు హోంమంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. కానీ కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో హోంమంత్రి కాన్వాయ్ ట్రాఫిక్ లోనే చిక్కుకుంది. జాతీయ రహదారిపై కిలో మీటర్ల కొద్దీ వాహనాలను నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
Next Story

