Sat Mar 07 2026 23:46:44 GMT+0530 (India Standard Time)
యశ్వంత్ సిన్హాను మేం కలవం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాను కలవబోమని చెప్పారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాను కలవబోమని చెప్పారు. తొలుత కేసీఆర్ ను కలిసి అనంతరం కాంగ్రెస్ సభ్యులతో భేటీ అవుతానని యశ్వంత్ సిన్హా చెప్పారన్నారు. అయితే కేసీఆర్ గడప తొక్కిన వారితో తాము కలవబోమని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ నిర్ణయం మేరకు తమ మద్దతు యశ్వంత్ సిన్హాకు ఉంటుందని, అయితే హైదరాబాద్ లో ఆయనను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ఎవరూ సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి చెప్పారు.
మంచి మిత్రుడు....
మరోవైపు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన తనకు మంచి మిత్రుడని, పార్టీ మారేటప్పుడు తనకు ఒక మాట చెబుతారని అనుకున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పారు.
Next Story

