Wed Feb 12 2025 07:57:55 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ మీ నాయన్ని అడుగు.. చెబుతాడు
రాహుల్ గాంధీని టీఆర్ఎస్ నేతలు విమర్శించడం సరికాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

రాహుల్ గాంధీని టీఆర్ఎస్ నేతలు విమర్శించడం సరికాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ తన విహార యాత్ర ను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. హరిత విప్లవాన్ని కాంగ్రెస్ తీసుకు వచ్చిందన్నారు. బీడు వారిన భూములకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుంచుకోవాలన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందంటే?
యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అన్నారని, చెప్పడానికి ఎంతో లిస్టు ఉందని రేవంత్ తెలిపారు. రైతులు పండించిన పంటను విక్రయించుకోవడానికి మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. కేటీఆర్ మీ నాయన్ని అడుగు అన్నీ చెబుతాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తును అందించింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ తెలిపారు.
- Tags
- revanth reddy
- ktr
Next Story