Fri Dec 05 2025 09:25:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మా కాంబినేషన్ సక్సెస్
తనది, ముఖ్యమంత్రి కాంబినేషన్ సక్సెస్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

తనది, ముఖ్యమంత్రి కాంబినేషన్ సక్సెస్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీబీఐలో కొంత లొసుగులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారరు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ముందుకు సాగుతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు.
అందరినీ కలుపుకుని...
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళుతున్నామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీబీఐలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
Next Story

