Thu Mar 19 2026 07:04:54 GMT+0530 (India Standard Time)
Telangana : ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీలో 52 మంది అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో మొత్తం 52 మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో మొత్తం 52 మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్దులు నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
27న పోలింగ్...
ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలూ డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.
Next Story

