Fri Dec 05 2025 11:02:39 GMT+0000 (Coordinated Universal Time)
Ponnam Prabhakar : నేడు పొన్నం పర్యటన వివరాలివే
నేడు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

నేడు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం రామవరం లో రామవరం నుండి హుస్నాబాద్ వరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డు గా అభివృద్ధి చేయుటకు శంకుస్థాపన చేస్తారు.ఉదయం 10 గంటలకు కొత్తకొండలో కొత్తకొండ నుండి అంతక్ పేట్ వరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డు గా అభివృద్ధి చేయుటకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం పదకొండు గంటలకు హనుమకొండ బస్ డిపోలో 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,కొండా సురేఖ లతో కలిసి ప్రారంభిస్తారు.
పాతబస్తీలో చెక్కుల పంపిణీ...
అనంతరం హనుమకొండ అశోక హోటల్ జంక్షన్ రోడ్డు లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను ప్రారంభించి విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఓల్డ్ సిటీ మెట్రో కోసం భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేస్తారు , కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆరంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ లాన్స్ లో జెన్కో లో ఏఈ లకు ఉద్యోగ నియామక పత్రాలు కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

