Wed Mar 25 2026 01:27:10 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ లోకి నేడుభారీ చేరికలు
నేడు ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలున్నాయి. కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరుతున్నారు

నేడు ఆంధ్రప్రదేశ్ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి భారీ చేరికలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు తోట చంద్రశేఖర్ తన అనుచరులతో కలసి గుంటూరు నుంచి బయలుదేరారు. ఆయన ప్రగతి భవన్ కు చేరుకుని కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు.
మాజీ మంత్రి రావెల...
అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్ధసారధితో పాటు మాజీ మంత్రి రావెల చంద్రశేఖర్ కూడా పార్టీలో చేరనున్నారు. వీరందరినీ సాదరంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వీరు పార్టీలో చేరతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడానికి చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
Next Story

