Thu Mar 19 2026 10:42:52 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ బంద్.. అప్రమత్తమయిన పోలీసులు
నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.

నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు తెలంగాణ బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నారు. మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏజెన్సీ ప్రాంతంలో...
అనేకచోట్ల పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పహరా కాస్తున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. పోలీసు బందోబస్తు తీవ్రతరం చేశారు.
Next Story

