Sun Mar 08 2026 06:30:57 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ సభ.. కీలక నిర్ణయం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేడు టీడీపీ తినిధుల సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతినిధుల సభ కీలకంగా మారనుంది. తెలంగాణ సర్కార్‌పై పోరాటానికి ఈ వేదిక మీద నుంచే చంద్రబాబు పిలుపునివ్వనున్నారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో...
ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ సక్సెస్ కావడంతో నిజామాబాద్‌లో మరో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలా? లేక మరో పార్టీతో కలవాలా? అన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. బీజేపీతో కలసి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన, టీడీపీ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందన్న సంకేతాన్ని ఈ సభ ద్వారా పంపనున్నారు.
Next Story

