Thu Mar 26 2026 18:11:37 GMT+0530 (India Standard Time)
నేడు కాంగ్రెస్ నేతలతో ప్రియాంక సమావేశం
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు.

నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారతీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలను రాష్ట్రం నుంచి ఆహ్వానించారు. పీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, జానారెడ్డి వంటి నేతలు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.
అంతర్గత విభేదాలు...
మునుగోడు ఉప ఎన్నికతో పాటు పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదంతంతో పాటు మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా చర్చకు రానున్నాయి. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరనుంది.
Next Story

