Fri Dec 05 2025 17:34:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాలమూరుకు ప్రపంచ సుందరీమణులు
నేడు పాలమూరు జిల్లాకు ప్రపంచ సుందరీమణులు రానున్నారు. పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రికి అందాల భామలు రానున్నారు.

నేడు పాలమూరు జిల్లాకు ప్రపంచ సుందరీమణులు రానున్నారు. పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రికి అందాల భామలు రానున్నారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వారంతా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.పిల్లల మర్రిలో వందలనాటి ఏళ్ల వృక్షాన్ని పరిశీలించనున్నారు.
హైదరాబాద్ లోని ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్క్ ను...
దీంతో పాటు హైదరాబాద్ లోని ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్క్ ను కూడా ప్రపంచ సుందరీ మణులు సందర్శించనున్నారు. ప్రపంచ అందాల పోటీల్లో పాల్గనేందుకు వచ్చిన వారు పాలమూరు జిల్లాకు వస్తుండటంతో పోలీసులు భారీ బందబోస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే అందాల భామలు నాగార్జున సాగర్ లోని బుద్ధవనం, చార్మినార్, వరంగల్ లోని వేయి స్థంభాల గుడి, రామప్ప దేవాలయం, యాదగిరి గుట్ట, భూదాన్ పోచంపల్లిని సందర్శించిన అందాల భామలు నేడు పిల్లల మర్రికి రానున్నారు.
Next Story

