Thu Mar 26 2026 20:46:28 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ ఛాన్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు ఆఖరు తేదీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు ఆఖరు తేదీ. దీంతో ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు చేసిన వారు ఎంత మంది ఉపయోగించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అనేక చోట్ల పార్టీల తరుపున పలువురు పోటీ చేశారు. బీఫారాలు ఇచ్చిన వారికే పార్టీ గుర్తు లభిస్తుంది. దీంతో మిగిలిన వారు పోటీ నుంచి విరమించుకుంటే ఓకే. లేకుంటే రెబల్స్ గా పోటీ లో ఉంటారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ రెబల్ అభ్యర్థులను నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
రెబల్స్ ను తప్పించేందుకు...
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2,996 వార్డులకుగాను 20,313 మంది 29,694 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఈ మేరకు పరిశీలన అనంతరం 19,608 నామినేషన్లు అర్హత సాధించాయని అధికారులు తెలిపారు. అయితే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది లిస్టును ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు
Next Story

