Sun Mar 15 2026 11:14:57 GMT+0530 (India Standard Time)
BRS : నేడు తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు

బీఆర్ఎస్ రాజ్యసభ సభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వద్దిరాజు రవిచంద్రకు బీఫారం అందచేశారు. నేడు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో నిన్నరాత్రి వద్దిరాజును అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వద్దిరాజు రవిచంద్రకు మరొకసారి రాజ్యసభకు పంపాలని బీఆర్ఎస్ చీఫ్ నిర్ణయించారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్...
తెలంగాణలో ఖాళీ అవతున్న మూడు రాజ్యసభ స్థానాలలో రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ కు దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇద్దరి పేర్లను, బీఆర్ఎస్ ఒక పేరును ప్రకటించింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. వీరిద్దరూ ఈరోజు నామినేషన్లు వేయనున్నారు. వీరి నామినేషన్ల కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీంతో ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగానే ఎంపికయ్యే అవకాశముంది.
Next Story

