Wed Mar 18 2026 22:05:17 GMT+0530 (India Standard Time)
నేడు గురుపౌర్ణమి.. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో
నేడు దేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో సాయి బాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి

నేడు దేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో సాయి బాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులకు క్యూ కట్టారు. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సాయిబాబా విగ్రహాలపై పాలు పోసి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక పూజలు....
హైదరాబాద్ లోని దిల్్సుఖ్ నగర్ లో సాయిబాబా ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక అన్ని చోట్ల ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢమాసం పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. దీంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలను చేస్తున్నారు.
Next Story

