Fri Dec 19 2025 07:38:07 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనుగోళ్లకు మంచి సమయమట
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతిరోజూ పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు స్థిరంగానే ఉన్నాయి.

బంగారం ఎప్పుడు కొనుగోలు చేసినా దానికి విలువ పడిపోదు. పెట్టుబడి రూపంలో మనకు ఎప్పటికైనా పనికొస్తుంది. అందుకే దేశంలో బంగారం కొనుగోళ్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఆభరణాల రూపంలో కొనుగోలు చేసే వారు కొందరైతే, 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేసి లాకర్లలో దాచుకునే వారు మరికొందరు. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుని లాభాలు గడించిన వారు కూడా లేకపోలేదు.
ఈరోజు ధరలు....
అయితే ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతిరోజూ పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర 44,700లు ఉండగా, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,760లుగా ఉంది. బంగారం కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story

