Sat Mar 21 2026 04:50:51 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు కీలక శాఖ అధికారులతో మల్లువిక్రమార్క భేటీ
కీలక శాఖ అధికారులతో నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు.

కీలక శాఖ అధికారులతో నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఆయన ఆర్థికమంత్రి కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుతున్నారు. నేడు ఆదాయం సమకూర్చి పెట్టే శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, పరిశ్రమలు, గనులు శాఖల అధికారులు ఆయన ఏర్పాటుచేసిన సమావేశం లో పొల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖ మంత్రులు కూడా హాజరుకానున్నారు.
ఆదాయం సమకూర్చి పెట్టే...
ఇప్పటి వరకూ వచ్చిన ఆదాయం ఎంత? సమకూర్చుకోవాల్సిన ఆదాయంపై ఆయన సమావేశం నిర్శవిహంచనున్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అది జులై చివరికి ముగియనుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టి ఉభయ సభల ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. అందుకే నేడు మల్లు భట్టి విక్రమార్క ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని వివరాలను సేకరించి మంత్రివర్గంలో ఆయన చర్చించనున్నారు.
Next Story

