Thu Jan 29 2026 02:40:26 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మెదక్ జిల్లాకు బీఆర్ఎస్ అధినేత
నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు

నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మెదక్ జిల్లాలోని సుల్తాన్పూర్ లో ప్రజా ఆశీర్వద సభ పేరిట బహిరంగ సబను నిర్వహించనున్నారు. ఈ సభకు పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా నేతలు చర్యలు తీసుకుంటున్నారు.
లక్ష మందికి పైగా...
దాదాపు లక్ష మందికిపైగా జనాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో నేతలు ఉన్నారు. సాయత్రం 5.30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇప్పటికే చేవెళ్ల నుంచి లోక్సభ ఎన్నికలను ప్రారంభించిన కేసీఆర్ తన రెండో సభ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి సుల్తాన్ పూర్ కు చేరుకుంటారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Next Story

