Wed Feb 19 2025 20:46:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వసంత పంచమి... కిటకిటలాడుతున్న దేవాలయాలు
నేడు వసంత పంచమి కావడంతో సరస్వతి ఆలయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి

నేడు వసంత పంచమి కావడంతో సరస్వతి ఆలయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి రోజున అక్షర భ్యాసం చేసియిస్తే శుభప్రదమని భావించి ఎక్కువ మంది భక్తులు బారులు తీరారు. బాసరలోని సరస్వతీ క్షేత్రంతో పాటు విజయవాడలోని కనకదుర్గ దేవాలయంలో కూడా నేడు అక్షరాభ్యాసాలు జరుగుతున్నారు.
అక్షరాభ్యాసాలు చేయించడం కోసం...
సరస్వతిదేవి వద్దకు వచ్చి ఓనమాలు నేడు దిద్దితే చదువు బాగా అబ్బుతుందని విశ్విసిస్తారు. అందుకే వసంతి పంచమి రోజును ఎక్కువగా అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. జ్ఞానశక్తిని పెంపొందించే సరస్వతి దేవాలయాలతో పాటు అమ్మవారి ఆలయాల్లో కూడా నేడు అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. బాసరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వర్గల్ లోని సరస్వతి దేవాలయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
Next Story