Fri Nov 08 2024 14:22:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సెప్టంబరు 17 వేడుకలు
నేడు సెప్టెంబర్ 17వ తేదీ కావడంతో భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది.
నేడు సెప్టెంబర్ 17వ తేదీ కావడంతో భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయిన రోజును విమోచన దినోత్సవంగా జరపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంది. విమోచన దినోత్సవ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ కార్యాయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు.
పార్టీలు వేర్వేరుగా...
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తరుపున మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనననున్నారు. తొలుత అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించనున్నారు. జిల్లాల్లో జెండాను మంత్రులు ఎగురవేయనున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఈవేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. విలీనదినోత్సవమని బీజేపీ, ప్రజాపాలన దినోత్సవంగా కాంగ్రెస్ ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి.
Next Story