Sun Mar 15 2026 20:19:23 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మరో కొత్త పార్టీ
తెలంగాణలో కొత్త పార్టీని తీన్మార్ మల్లన్నప్రకటించారు. చర్లపల్లి జైలు బయట ఆయన ప్రకటించారు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. "తెలంగాణ నిర్మాణ పార్టీ" పేరిట తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ప్రకటించారు. చర్లపల్లి జైలు ముందే పార్టీ పేరు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ను గద్దె దించేవరకూ...
తాను ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ .తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో వస్తుందని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని తీన్మార్ మల్లన్న తెలిపారు. కేసులు సెక్షన్ గా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వీకర్ సెక్షన్ గా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినీపించకోకుండా చేస్తానని తీన్మార్ మల్లన్న ఈ సందర్భంా ప్రకటించారు.
Next Story

