Sun Feb 01 2026 23:01:39 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఇదే
తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉంటుంది

తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత రెడ్డి తెలిపారు.
కేసీఆర్ పుట్టిన రోజున...
దాదాపు 650 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. పాత సచివాలయం భవనం ఉన్న ప్రాంతంలోనే దీనిని నిర్మించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ సచివాలయాలు కొద్దిరోజులు ఇక్కడే నడిచాయి. అయితే ఏపీ సర్కార్ అమరావతికి తరలి వెళ్లడంతో పాత భవనాలను కూల్చి వేసి కొత్త సచివాలయాన్ని నిర్మించారు. వచ్చే నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
Next Story

