Thu Mar 12 2026 19:30:15 GMT+0530 (India Standard Time)
సింగరేణి బొగ్గుగనిలో కరోనా కలకలం
సింగరేణి బొగ్గుగనిలో కలకలం రేగింది. తొమ్మిది మందికి కరోనా పాజటివ్ గా నిర్థారణ అయింది

సింగరేణి బొగ్గుగనిలో కలకలం రేగింది. తొమ్మిది మందికి కరోనా పాజటివ్ గా నిర్థారణ అయింది. భూపాలపల్లి సింగరేణి ఏరియా ఓపెన్ కాస్ట్ గనుల్లో తొమ్మిది మందికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు కార్మికులతో పాటు, సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరందరికీ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కార్మికుల్లో ఆందోళన....
సింగరేణి బొగ్గుగనిలో కరోనా కలలకం రేగడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే విధుల్లోకి పంపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story

