Fri Mar 20 2026 09:50:42 GMT+0530 (India Standard Time)
పోలీసులపై తిరగబడ్డ వైఎస్ షర్మిల
లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ను ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు బయటకు వెళ్లకుండా ఆపుతున్నారో చెప్పాలంటూ వైఎస్ షర్మిల అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులపై వైఎస్ షర్మిల తిరగబడ్డారు. కొందరు పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు.
పోలీసులతో...
తనను వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా పోలీసులను నెట్టి వేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా లోటస్ పాండ్ వద్ద భారీగా మొహరించి షర్మిల కారు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
Next Story

