Fri Dec 05 2025 13:18:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: గుడెసెలో దీపం పెట్టి మేడారానికి... గుడెసెల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో?
కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కూలీలు గుడెసలకు మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగింది

కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కూలీలు గుడెసలకు మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగింది. గుడెసెలో దీపం పెట్టి వలస కూలీలు మేడారం జాతరకు వెళ్లారు. దీపం అంటుకుని గుడెసెకు నిప్పంటుకుంది. పక్కన ఉన్న గుడెసెలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. దీంతో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. కరీంనగర్లోని ఆదర్శనగర్ లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రాణనష్టం మాత్రం జరగలేదు. దాదాపు ఇరవై గుడెసెలు మంటల్లో దగ్దమయ్యాయి.
పెద్దయెత్తున శబ్దం రావడంతో...
ఇక మంటలు అంటు కోవడంతో గుడెసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. మొత్తం పది గ్యాస్ సిలిండర్లు పేలినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ శబ్దంతో పాటు మంటలు రావడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ఆస్తినష్టం ఎంత జరిగిందన్నది ఇంకా అంచనాకు రాలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
Next Story

