Thu Mar 19 2026 05:48:52 GMT+0530 (India Standard Time)
AllwynPharma Fire Accident : ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
షాద్నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మా కంపెనీలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

AllwynPharma Fire Accident :షాద్నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మా కంపెనీలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తున్నాయి. అయితే మంటల్లో కార్మికులు ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనేక మంది కార్మికులను బయటకు రప్పిస్తున్నారు.
నిచ్చెన ద్వారా...
నిచ్చెన ద్వారా కంపెనీలో నుంచి కార్మికులు కొందరు బయటకు వచ్చారు. ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల కూడా మంటలు వ్యాపించే అవకాశముందని భావించిన అధికారులు మరిన్ని అగ్నిమాపక శకటాలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు ఎందరు లోపల ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Next Story

