Fri Dec 05 2025 23:13:13 GMT+0000 (Coordinated Universal Time)
గన్పార్క్ వద్ద ఉద్రిక్తత : బండి దీక్ష
హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ దీక్షకు దిగారు

హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ దీక్షకు దిగారు. టీఎస్పీఎస్పీ పరీక్షలను రద్దు చేయాలని, లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన బండి సంజయ్ సడెన్ గా దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్ దీక్షకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా తోడయ్యారు.
భారీగా పోలీసులు...
దీంతో గన్ పార్క్ వద్ద పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. ఇక్కడ దీక్షలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా తాను దీక్ష చేయడం ఖాయమని, అరెస్ట్ చేేస్తే చేనుకోవచ్చని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎవరూ అరెస్ట్లకు భయపడరని ఈటల రాజేందర్ అన్నారు. ఇంకా బండి సంజయ్ కార్యకర్తలతో కలసి దీక్ష చేస్తూనే ఉన్నారు.
Next Story

