Fri Dec 05 2025 16:10:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. 23 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. 23 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితోపాటు ఆరుగురు ఐఏఎస్ అధికారులకు కూడా స్థాన చలనం కల్పించారు. తెలంగాణ డీజీపీ గా శివధర్ రెడ్డిని నియమించిన గంటల్లోనే ఈ బదిలీలు జరిగాయి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది.
ఆరుగురు కలెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు...
1994 బ్యాచ్ కుచెందిన శివధర్ రెడ్డి కి హెడ్ ఆఫ్ ది పోలీస్ గా అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. నిన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించిన ప్రభుత్వం నేడు ఐపీఎస్ బదిలీలను చేస్తూ నిర్ణయం తీసుకుంది.అలాగే ఆరుగురు జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ పై బదిలీ వేటు వేసింది. సిరిసిల్ల కలెక్టర్ గా హరితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

