Fri Dec 05 2025 15:23:41 GMT+0000 (Coordinated Universal Time)
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి ..!!
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయనతో పాటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లో ఈడీ ప్రస్తావించింది. అయితే వీరిని నిందితులుగా చేర్చలేదు. యంగ్ ఇండియా సంస్థ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ఈడీ ఆరోపించింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 2,000 కోట్ల రూపాయలకు విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది.
Next Story

