Mon Dec 08 2025 16:18:04 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...1,743 ఉద్యోగాలు
టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది

టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ మేరకు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెయ్యిడ్రైవర్ పోస్టులకు 743 శ్రామిక్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలయింది. అక్టోబరు ఎనిమిదో తేదీ నుంచి 28వ తేదీని దరఖాస్తు ఇచ్చేందుకు చివరి తేదేగా నిర్ణయిస్తూ టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది.
దరఖాస్తుకు చివరితేదీ
గడువు తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను అందచేయాలని నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.tgprb.in లో చూడవచ్చని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక వివిధ పరీక్షలు, వారి అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఉంటుదని తెలిపారు.
Next Story

