Sat Mar 07 2026 22:44:41 GMT+0530 (India Standard Time)
గ్యాస్ లీకయి నలుగురి మృతి
పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి తొమ్మిది మంది మృతి చెందారు

పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి తొమ్మిది మంది మృతి చెందారు. పంజాబ్ లోని లూథియానా, షేర్పూర్ చౌక్ సమీపంలో సువా రోడ్డులో గోయల్ మిల్క్ ప్లాంట్ నెలకొని ఉంది. ఇక్కడ డెయిరీ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కూలింగ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు కార్మికులు గుర్తించారు.
మృతుల సంఖ్య...
కానీ అప్పటికే ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అయితే ఎంత మంది అస్వస్థతకు గురయ్యారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వెంటనే సహాయకచర్యలు ప్రారంభమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యలు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

