Tue Mar 10 2026 07:02:46 GMT+0530 (India Standard Time)
నేటితో ముగియనున్న గడువు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. పార్టీ లైన్ కు విరుద్ధంగా ఆయన వ్యవహరించారంటూ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని బీజేపీ రాజాసింగ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ షోకాజ్ నోటీసుకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ గడువు నేటితో ముగియనుంది.
మరో పది రోజులు....
అయితే నిన్ననే రాజాసింగ్ భార్య బీజేపీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. రాజాసింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. దీనిపై బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు.
Next Story

