Thu Mar 19 2026 01:45:32 GMT+0530 (India Standard Time)
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈరోజు వరంగల్ లో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.ః
వరంగల్ రచ్చబండకు...
పోలీసులు తనను అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దయెత్తున మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసు అధికారులు రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు. తాను వరంగల్ వెళ్లి తీరాల్సిందేనని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేయనున్నారు.
Next Story

