Mon Feb 23 2026 11:44:47 GMT+0530 (India Standard Time)
Telangana : కామారెడ్డిలో కొనసాగుతున్న టెన్షన్
కామారెడ్డిలో టెన్షన్ కొనసాగుతుంది

కామారెడ్డిలో టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి తేల్చుకోనున్నారు. కలెక్టరేట్లో తేల్చుకుందామని ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రకటన చేయడంతో మరోసారి టెన్షన్ నెలకొంది. సమితి భూములపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన చర్చకు రానున్నారు. కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు.
బీజేపీ నేతల ప్రకటనతో...
నేడు కామారెడ్డికి బీజేపీ ముఖ్య నేతలు కూడా వస్తామని ప్రకటించారు. నేడు కూడా హౌస్అరెస్ట్లు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టి హింసను ప్రోత్సహిస్తున్నారని..ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు బీజేపీ నేతలు కొందరిపై కేసులు నమోదు చేశారు. ఈరోజు కూడా కామారెడ్డిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

