Thu Dec 18 2025 05:20:30 GMT+0000 (Coordinated Universal Time)
ఓల్డ్ సిటీలో టెన్షన్.. పోలీసు వాహనం ధ్వంసం
హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ కొనసాగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో నిరసనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ కొనసాగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో పాతబస్తీలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ఎంఐఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల కారణంగా ఒక పోలీసు వాహనం ధ్వంసం అయింది. దీంతో పాతబస్తీకి అదనపు బలగాలను దించారు.
అదనపు బలగాలను...
ఎంఐఎం కార్యకర్తలకు పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను కూడా లెక్క చేయకుండా యువకులు పాతబస్తీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. అర్థరాత్రి పోలీసు వాహనం పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో పోలీసులు యువకులపై లాఠీ ఛార్జి చేశారు. పాతబస్తీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రప్పించారు.
Next Story

