Fri Mar 27 2026 17:12:13 GMT+0530 (India Standard Time)
బీజేపీ అభ్యర్థి బలవన్మరణం.. డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది

హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి కారణం అధికార పార్టీ కారణమని ఆరోపిస్తూ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అతనిని పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తేవడం వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించి వేశారు.
నారాయణ పేట్ జిల్లాలో ...
నారాయణ పేట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం తన ఇంట్లో మహదేవ్ ఉరేసుకుని చనిపోయాడు. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపు ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఒక్కరోజు ముందే అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Next Story

