Tue Jan 20 2026 18:18:13 GMT+0000 (Coordinated Universal Time)
యాదాద్రి ఘటనపై చర్యలకు సిద్ధం
యాదగిరి గుట్టలోని మాడ వీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆలయ ఈవో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు

యాదగిరి గుట్టలోని మాడ వీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆలయ ఈవో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈరోజు ఉదయం హరీశ్ రావు మాడ వీధుల్లో రైతు రుణమాఫీ సక్రమంగా చేయలేదని ఆరోపిస్తూ పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖలో నిబంధనల ప్రకారం మాడ వీధుల్లో పాప ప్రక్షాళన చేయకూడదని తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు...
అయితే ఉన్నతాధికారులతో కలసి ఈ ఘటనపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఇలా ఆలయాల్లోకి వచ్చి పాప ప్రక్షాళన చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story

