Mon Mar 30 2026 11:37:51 GMT+0530 (India Standard Time)
Summer Effect : వామ్మో ఏప్రిల్, మే నెలల్లో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయో తెలిస్తే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు వరకూ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 48 డిగ్రీలకు పైగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతకు మించి నమోదయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు...
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో యాభై వరకూ చేరుకునే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దాదాపు ఎనభైకి మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటి వేళ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు...
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి 37 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. రానున్న కాలంలో నలభై నుంచి నలభై ఎనిమిది డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు మండలాలకు ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ ను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈసారి వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Next Story

