Tue Jan 20 2026 19:32:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నాలుగురోజులు మండే ఎండలు.. బయటకు వస్తే ఇక అంతే
తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే మూడు రోజులు మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే మూడు రోజులు మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నల్లగొండలో 44.6 డిగ్రీలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44.5 డిగ్రీలు సూర్యాపేటలో 44. 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయని వాతావరణ శాఖ తెలిపింది.
వడగాలులు కూడా...
దీంతో పాటు మరో మూడు నాలుగు రోజులు వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. అనేక జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించింది. అత్యవసర పనుల కోసం వచ్చిన మంచినీళ్లు, మజ్జిగ తాగుతూ డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవాలని చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో ఎండలు మరింత మండిపోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
Next Story

