Fri Mar 21 2025 07:41:01 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : ఐదురోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే.. మాడిపోవాల్సిందేనట
తెలంగాణలో నేటి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

తెలంగాణలో నేటి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకుంది. ఇక రానున్న ఐదురోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమదోయ్యే అవకాముందని తెలిపింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
భారీ ఉష్ణోగ్రతలు...
భారీ ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు ఉదయం ఎనిమిది గంటలు దాటితే వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. భానుడి భగభగలతో రహదారులు కూడా వెడెక్కుతున్నాయి. ఏదైనా పని ఉంటే ఉదయం ఎనిమిది గంటలలోపు, లేదంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే నమోదవుతున్నాయి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో కొద్దిగా చల్లగాలులు వీచినా తర్వాత వడగాలులు వీస్తున్నాయి.
ఈ నెల 18వరకూ...
నేటి నుంచి వచ్చే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని, కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
Next Story