Tue Dec 16 2025 05:49:08 GMT+0000 (Coordinated Universal Time)
సెప్టంబరులో భారీ బహిరంగ సభ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. భద్రాచలంలో ఖమ్మం, మహబూబాబాద్ కమిటీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
మంచి రోజులు వచ్చాయి...
తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనపడుతుందన్నారు. హైదరాబాద్ లోనే టీడీపీ పుట్టిందన్న చంద్రబాబు పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. సెప్టంబరు రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ టీడీపీ పై కూడా తాను దృష్టి పెడతానని, ఓటు బ్యాంకు ఉన్న టీడీపీకి సరైన నాయకత్వం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరింతగా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తానని వెల్లడించారు.
Next Story

