Sat Dec 06 2025 00:47:41 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో టీడీపీ మరో భారీ సభ
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కార్యాచరణను రూపొందించారు

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కార్యాచరణను రూపొందించారు. ఖమ్మంలో జరిగిన సభ సూపర్ సక్సెస్ కావడంతో ఆయన మరో సభను తెలంగాణలో ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. బీజేపీతో పొత్తును తెలంగాణ నుంచి ప్రారంభించాలన్న ఆయన ఆలోచనను తమ్ముళ్లు కార్యరూపంలోకి పెట్టబోతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చంద్రబాబు సక్సెస్ అయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సభ చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్....
ఖమ్మం తరహాలోనే మరోచోట సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తేదీ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ స్థలం మాత్రం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ లో టీడీపీ సభను ఏర్పాటు చేయడానికి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకుతో పాటు ఎక్కువమంది సెటిలర్లు ఉండటం కారణంగానే సభను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటున్నారు. ఇందుకోసం సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు కూడా చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రత్యేక సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
Next Story

