Fri Dec 05 2025 13:58:27 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైన తెలుగు వాళ్లు వీరే
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల్లో ఏపీ, తెలంగాణ నుంచి పది మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లాకు చెందిన చాడా నిఖిల్ రెడ్డి పదకొండో స్థానంలో నిలిచి అగ్రస్థానంలో నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నిఖిల్ రెడ్డి అత్యుత్తమ ర్యాంకు సాధించారు.
ర్యాంకర్లు వీరే...
ఇక యెదుగూరి ఐశ్వర్యారెడ్డికి పదమూడో ర్యాంకు వచ్చింది. జి. ప్రశాంత్ కు ఇరవై ఐదో ర్యాంకు, చెరుకు అవినాశ్ రెడ్డికి నలభైవ ర్యాంకు, చింతకాలయ లవకుమార్ కు నలభై తొమ్మిది ర్యాంకు, అట్ల తరుణ్ తేజ్ కు యాభై మూడు ర్యాంకు, ఆలపాటి గోపినాధ్ కు యాభై ఐదో ర్యాంకు, కె. ఉదయ కుమార్ కు 77, టీఎస్ శిశిర కు 87వ ర్యాంకు వచ్చింది. ర్యాంకర్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story

