Thu Dec 18 2025 22:57:21 GMT+0000 (Coordinated Universal Time)
జయసుధ ఆయన్ను కలవడంతో పొలిటికల్ సస్పెన్స్
తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన

సహజనటి జయసుధకు పాలిటిక్స్ లో కూడా మంచి గ్రిప్ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా తెలంగాణలో ఆమెను నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె మరోసారి పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలు జయసుధ తాజాగా కిషన్‌రెడ్డితో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. జయసుధ బీజేపీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఆమె రాక బీజేపీకి ప్లస్ అవుతుందని సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో పార్టీకి బలం పెరుగుతోందని భావిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డిని ఇటీవల కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి జయసుధ ఆపార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు ఆమె బీజేపీలోకి చేరుతారనే వార్తలు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ గెలుపొందారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయసుధ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story

