Fri Mar 27 2026 18:08:20 GMT+0530 (India Standard Time)
Breaking : టీడీపీ సీనియర్ నేత మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె విజయరామారావు మరణించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె విజయరామారావు మరణించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. సీబీఐ డైెరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
మాజీ మంత్రిగా...
తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన మంత్రిగా సేవలందించారు. నిక్కచ్చిమైన అధికారిగా ఆయన పేరుపొందారు. కొన్నేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యానికి గురైన విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
Next Story

