Wed Jan 21 2026 03:32:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరగనుంది.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరగనుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 32 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రేపు ప్రతినిధుల సభ....
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో జరగనుంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు.
Next Story

