Tue Mar 10 2026 05:23:00 GMT+0530 (India Standard Time)
టీడీపీకి షాక్... సీనియర్ నేత రాజీనామా
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో వరస షాక్ లు తగులుతున్నాయి. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో వరస షాక్ లు తగులుతున్నాయి. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగలేనని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనతో టీడీపీకి తెలంగాణలో మనుగడ కష్టంగా మారిందన్నారు.
కాంగ్రెస్ లో చేరేందుకు...
అందుకే తన అనుచరులు, కార్యకర్తల అభిప్రాయం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. త్వరలోనే మరో పార్టీలో చేరతానని తెలిపారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్, దేవరకద్ర నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన కొత్త కోట దయాకర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

