Thu Mar 19 2026 05:27:09 GMT+0530 (India Standard Time)
Chandrababu : తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం చేసే దిశగా
ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు

ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడిని నియామకం చేసే విషయంపై ఆయన ముఖ్యనేతలతో చర్చిస్తారు.
నేతలకు దిశానిర్దేశం...
భవిష్యత్ లో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు పై చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశంచేయనున్నారు. హైదరాబాద్ లో జరిగే ఈ భేటీ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొననున్నారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Next Story

