Mon Mar 02 2026 10:08:40 GMT+0530 (India Standard Time)
లండన్‌లో తెలంగాణ యువకుడు మృతి
లండన్‌లో తెలంగాణ యువకుడు మృతి

లండన్‌లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఎంఎస్ పూర్తి చేసి, లండన్‌కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకర్ మూడు రోజుల క్రితమే తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో శ్రీకర్ కు తీవ్ర గాయాలు.. బ్రెయిన్ డెడ్ తో ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ మృతి చెందారు.
అగ్నిప్రమాదం జరిగి...
ఉజ్వల భవిష్యత్ కోసం లండన్ వెళ్లి తన కుటుంబాన్ని సంతోష పెట్టాలనుకున్నశ్రీకర్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకర్ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. డెడ్ బాడీని త్వరగా ఇండియాకు తెప్పించాలని ప్రభత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఈ ప్రమాదంలో పెద్దాపురానికి చెందిన యువకుడు కూడా సజీవ దహనమయ్యాడు.
Next Story

